కుప్పం పర్యటనలో భాగంగా తెలుగు యువత కమిటీ సమావేశంలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం యువతను నిండా ముంచిందని.. జాబ్ కేలండర్ ఏమైందని ప్రశ్నించారు.
టీడీపీ హయాంలో యువతకు రూ.2500 నిరుద్యోగ భృతి ఇచ్చామమని.. నిరుద్యోగ భృతి ఎందుకు తీసేసారు అనేది సీఎం చెప్పాలన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత యువత తీసుకోవాలని.. ఉపాధి లేకుంటే యువత నిరాశ, నిస్పృహలకు లోనవుతారని.. ఈ ప్రభుత్వంపై తాను చేసే యుద్ధం యువత భవిష్యత్తు కోసమేనన్నారు.