–ఈ నెల 25 వరకు తెలంగాణలో వర్షాలు
-కర్ణాటక, తెలంగాణ మీదుగా ఉపరితల ద్రోణి
-ద్రోణి ప్రభావంతో వర్షాలు
-పలుచోట్ల ఈదురు గాలులతో వానలు
-హైదరాబాద్ లోనూ చల్లబడిన వాతావరణం
తెలంగాణలో ఓ వైపు ఎండలు భగ్గుమంటున్నాయి. మరోవైపు వర్షాలు కూడా మోస్తరుగా కురుస్తుండటంతో ప్రజలు కాస్త ఊరాటపొందుతున్నారు. రాష్ట్రంలో ఈ నెల 25వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖా వెల్లడించింది
. ఉరుముపు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. కర్ణాటక , తెలంగాణ మీదుగా ఉపరితల ద్రోణి ఆవరించి ఉందని, ఈ ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఈమేరకు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది. రెండు మూడు రోజులుగా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు భారీగా ఎండ కాస్తోన్న సాయంత్రం వేళలో మోస్తరు వర్షం పడుతుండటంతో నగరప్రజలకు రిలీఫ్ కల్గుతోంది.