ఏపీలో విద్యా సంస్థల బంద్ పై రచ్చ

ఏపీలో విద్యా సంస్థలను బంద్ చేయాలని విద్యార్ధి లోకం డిమాండ్ చేస్తోంది. కరోనా నేపథ్యంలో తమ ప్రాణాలు గాలిలో దీపంలా మారాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నా కరోనాను ఆప తరమా అంటూ ప్రభుత్వాన్నిప్రశ్నిస్తున్నారు.

ఏపీలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. గత 24 గంటల్లో 12,615 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 53,871 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రోజురోజుకు కేసుల పెరుగుతోంది.ఇలా కేసులు పెరుగుతునా విద్య సంస్థలను కొనసాగించడంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. పోరుగు రాష్ట్రాల్లో ఏపీలో కన్నా తక్కువ కేసులు నమ్దోడు అవుతున్నా విద్యా సంస్థలను బంద్ చేస్తుంటే.. ఏపీ సర్కార్ మాత్రం మూర్ఖంగా ఆలోచిస్తుందని మండిపడుతున్నారు విద్యార్థులు. ఎందుకు తమ ప్రాణాలతో గేమ్స్ ఆడుతున్నారని ప్రశ్నిస్తున్నారు. ఒకరికీ కరోనా సోకినా ఏదైనా జరిగితె ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీస్తున్నారు. తాత్కాలికంగా విద్యా సంస్థలను మూసివేస్తే భూమి తలకిందులు అవుతుందా అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. తమ పవర్ ఎన్నికల సమయంలో చూపిస్తామని వర్నింగ్ ఇస్తున్నారు.

Load More Related Articles
Load More By admin
Load More In ఆంధ్రప్రదేశ్

Leave a Reply

Your email address will not be published.