ప్రముఖ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ 2022 సంక్రాంతి విజేతగా నిలిచాడు. ఆయన దర్శకత్వంలో నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన చిత్రం “బంగార్రాజు” థియేటర్లలో దూసుకుపోతోంది.
ఇదిలా ఉండగా డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణకు ఇప్పుడు మరో బిగ్ ఆఫర్ వచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేశారు మేకర్స్. ప్రముఖ తమిళ ప్రొడక్షన్ హౌస్ స్టూడియో గ్రీన్ లో కళ్యాణ్ కృష్ణ బిగ్ వెంచర్ రూపొందబోతోంది. ఈ సందర్భంగా కళ్యాణ్ కృష్ణను కలిసిన కెఇ జ్ఞానవేల్ రాజా ఆయన “బంగార్రాజు” చిత్రం సాధించిన విజయం గురించి అభినందించారు.
“ఈ విషయాన్ని ప్రకటిస్తున్నందుకు సంతోషిస్తున్నాము. మేము తెలుగు సంక్రాంతి బ్లాక్ బస్టర్ “బంగార్రాజు” దర్శకుడు కళ్యాణ్ కృష్ణతో అతని తదుపరి భారీ వెంచర్ కోసం కలిసి పని చేయబోతున్నాము. ఇతర వివరాలు త్వరలో..” అని స్టూడియో గ్రీన్ ప్రకటించింది. ఇక మరోవైపు ‘బంగార్రాజు’ థియేటర్లలో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. నాగార్జున ముందుగా చెప్పినట్టుగానే ‘బంగార్రాజు’ పండగ లాంటి సినిమా. నాగ చైతన్య కొత్త లుక్, కృతి శెట్టితో ఆయన జోడి మరింత కొత్తగా కన్పిస్తూ, నాగార్జునలో ఫుల్ జోష్ అక్కినేని అభిమానులతో పాటు సినీ ప్రియులను విశేషంగా ఆలరిస్తున్నాయి.