సెన్సార్ పూర్తి చేసుకున్న ‘పుష్ప’

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన ‘పుష్ప’ సినిమా విడుదలకి ముస్తాబవుతోంది. ఈ నెల 17వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాలో సమంత ఒక ఐటమ్ సాంగులో మెరవనుంది. రీసెంట్ గా ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్ దూసుకెళుతోంది.

తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. సెన్సార్ వారు ఈ సినిమాకి U/A సర్టిఫికెట్ ను మంజూరు చేశారు. ఈ నెల 12వ తేదీన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. హైదరాబాద్ .. యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో  ఈ వేడుకను నిర్వహించనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి.

ఈ సినిమా కోసం దేవీశ్రీ అందించిన పాటలు .. ఒక్కొక్కటిగా వస్తూ, మాస్ ఆడియన్స్ ను అలరిస్తున్నాయి. ముఖ్యమైన పాత్రలు .. వాటి స్వరూప స్వభావాలను సుకుమార్ డిజైన్ చేసిన తీరు అందరిలో ఆసక్తిని పెంచుతోంది. విలన్ గా ఫాహద్ ఫాజిల్ ఈ సినిమాతో తెలుగు తెరకి పరిచయమవుతున్నాడు. జగపతిబాబు .. సునీల్ .. అనసూయ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.

Load More Related Articles
Load More By admin
Load More In ఆంధ్రప్రదేశ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *