అల్లు అర్జున్ కు సజ్జనార్ లీగల్ నోటీసు

టీఎస్‌ఆర్టీసీని కించపరిచేవిధంగా హీరో అల్లు అర్జున్‌, ర్యాపిడో సంస్థ తీసిన యాడ్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. నటుడు అల్లు అర్జున్ నటించిన రాపిడో ప్రకటనపై అభ్యంతరం వ్యక్తంచేసిన ఆర్టీసీ ఎండీ…యూట్యూబ్ లో ప్రసారం అవుతున్న ప్రకటనలో ఆర్టీసీ బస్సులు సాధారణ దోసెల మాదిరిగానే ఎక్కువ సమయం తీసుకుంటాయని, రాపిడో చాలా వేగంగా, సురక్షితంగా ఉంటుందని, అదే సమయంలో మసాలా దోసను సిద్ధం చేస్తుందని అల్లు అర్జున్ ప్రజలకు చెప్పడం సరికాదని అన్నారు.

ఈ ప్రకటనపై ఆర్టీసీ ప్రయాణీకులు, అభిమానులు, సంస్థ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులతో సహా అనేక వ్యక్తుల నుండి పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. ర్యాపిడో సర్వీసులతో పోల్చి ఆర్టీసీ బస్సులను ప్రతికూలంగా చూపించడాన్ని ఖండిస్తున్నామని ఆయన అన్నారు.

Load More Related Articles
Load More By admin
Load More In తెలంగాణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *