తెలంగాణలో మరిన్ని ఉప ఎన్నికలు..!?

తెలంగాణ వ్యాప్తంగా అందరి కళ్ళు హుజురాబాద్ ఉప ఎన్నికపైనే కేంద్రీకృతం అయ్యాయి. ఇక్కడి గెలుపోటములు అధికార పార్టీ భవిష్యత్ కు తలమానికంగా విశ్లేషిస్తున్నారు. అయితే ఇక్కడ టీఆర్ఎస్ ఓడి, ఈటల గెలుపొందితే మాత్రం రాష్ట్రంలో మరిన్ని ఉప ఎన్నికలు తప్పవని, హుజురాబాద్ రిజల్ట్స్ ను బట్టి కేసీఆర్ పై మరికొందరు ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఎగరేయడం ఖాయమని అంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు.

టీఆర్ఎస్ పురుడుపోసుకుంటున్నా నాటి నుంచి పార్టీనే అంటీపెట్టుకొని ఉన్న నేతలు…మధ్యలో వచ్చిన నేతలకు పదవులు కట్టబెట్టారని తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. పార్టీని నమ్ముకొని, ఉద్యమ సమయంలో కేసీఆర్ మాటను తూచా తప్పకుండా పాటించిన మమ్మల్ని కాదని…అధికారంలోకి వచ్చాక పదవుల కోసం పార్టీలో చేరిన ద్రోహులకు పదవులు ఎలా కట్టబెడుతారని లోలోపల అధినేత వైఖరిపై ఆగ్రహంగా ఉన్నారు. మరో వైపు అసెంబ్లీ ఎన్నికలకు రెండేళ్ళ సమయం మాత్రమే ఉండటంతో…ఈ లోపే ఏదైనా పదవిని కట్టబెట్టడం లేదా, వేరే దారి వెతుక్కోవడం మినహా మరో దారి లేదనే ఆలోచనలో ఉన్నారు. అయితే..అందుకు హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితాన్ని బట్టి అడుగులు వేయాలని అసంతృప్త నేతలు ఉన్నట్లు తెలుస్తోంది.

అలాగే, కేసీఆర్ వైఖరి మింగుడు పడక పార్టీలోనే కొనసాగుతున్నా ఎమ్మెల్యేలు సైతం హుజురాబాద్ లో ఈటల గెలిస్తే ఎక్కువ సమయం కూడా ఇవ్వకుండా పార్టీకి రీజైన్ చేసే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు విశ్లేషకులు. హుజురబాద్ లో టీఆర్ఎస్ గెలిస్తే ఒకే.. కేసీఆర్‌పై అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలు సైలెంట్ అయిపోతారు. ఆయ‌న‌ను ప్రశ్నించే, నిల‌దీసే ధైర్యం చేయ‌రు. కానీ ఈటెల గెలిస్తే మాత్రం టీఆర్‌ఎస్‌లో మ‌రికొందు అసంతృప్త ఎమ్మెల్యేలు కేసీఆర్‌పై తిరుగుబాటు చేస్తారని, అవ‌స‌ర‌మైతే ఎమ్మెల్యే పదవిని వదులుకుని ఉపఎన్నికకు వెళ్తార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.

Load More Related Articles
Load More By admin
Load More In తెలంగాణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *