ఏపీ సీఎం జగన్ కు బిగ్ రిలీఫ్-బెయిల్ రద్దు పై సిబిఐ కోర్టు తీర్పు

జగన్ మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసులో, ఏ1, ఏ2గా ఉన్న జగన్ మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డిల కండీషనల్ బెయిల్ రద్దు చేయాలి అంటూ, రఘురామకృష్ణం రాజు వేసిన పిటీషన్ పై ఈ రోజు సిబిఐ కోర్టు తీర్పు ఇచ్చింది. జగన్ మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డికి బిగ్ రిలీఫ్ వచ్చింది. జగన్ మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి బెయిల్ పిటీషన్ రద్దు చేయాలి అంటూ, రఘురామరాజు వేసిన పిటీషన్ ను సిబిఐ కోర్టు కొట్టేసింది.

జగన్, విజయసాయి రెడ్డి బెయిల్ రద్దు చేయాలి అంటూ రఘురామరాజు పిటీషన్ వేసారు. బెయిల్ కండీషన్ నిబంధనలు ఉల్లంఘించారు అంటూ రఘురామరాజు పిటీషన్ వేసారు. అయితే ఇదే విషయంలో సిబిఐ మాత్రం, ఎలాంటి కౌంటర్ వేయకుండా, సిబిఐ కోర్టుకే నిర్ణయం వదిలేసింది. ఈ పిటీషన్ పై రాష్ట్రం మొత్తం ఆసక్తి నెలకొంది. అయితే రఘురామరాజు మాత్రం, సిబిఐ కోర్టు నిర్ణయం పై ఆయన మొదటి నుంచి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిన్నే తెలంగాణా హైకోర్టులో కూడా లంచ్ మోషన్ పిటీషన్ వేసారు. సిబిఐ కోర్టు తీర్పు ఇవ్వకుండా ఆదేశాలు ఇవ్వాలని, వేరే బెంచ్ కు దీన్ని పంపించాలి అంటూ హైకోర్టుకు వెళ్ళగా, అక్కడ మాత్రం రఘురామరాజుకు రిలీఫ్ దొరకలేదు. మొత్తం మీద, సిబిఐ కోర్టు, ఈ రోజు జగన్, విజయసాయి రెడ్డికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది.

ఈ పిటీషన్ రద్దు చేసిన తరువాత రఘురామకృష్ణం రాజు స్పందించారు. సాక్షిలో వచ్చినప్పుడే తనకు అనుమానం వచ్చిందని, అందుకే బెంచ్ మార్చాలని అడిగాం అని, అయినా న్యాయస్థానాల మీద గౌరవంతో ఉన్నానని, దీని పై హైకోర్టులో అపీల్ కు వెళ్తామని అన్నారు. సాక్షి కధనలకు అనుకూలంగా కూడా రెండూ ఒకేసారి రావటం యాదృచికం అని అన్నారు. గత నెలలో సాక్షి ట్వీట్ చేసినప్పుడే అర్ధం అయ్యిందని, కోర్టు మీద అపోహలు లేకుండా, బెంచ్ మార్చాలని కోరామని, అయినా కోర్టు తన వాదన వినలేదని రఘురామరాజు తెలిపారు. సిబిఐ వాదనలు కూడా అసంబద్ధంగా అనిపించాయని, రెండేళ్లుగా కోర్టుకు రాకపోయినా, సిబిఐకి ఏమి అభ్యంతరం లేక పోవటం, ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని అన్నారు. దీని పై కలత చెందకుండా, హైకోర్టుకు వెళ్తాం అని, హైకోర్టు తరువాత సుప్రీం కోర్టుకు కూడా వెళ్తాం అని అన్నారు. ఇది ముందే ఊహించింది అని, కోర్టుల పై గౌవరం నమ్మకం ఉందని, నా ప్రయత్నంలో విఫలం అయ్యానని అన్నారు

Load More Related Articles
Load More By admin
Load More In ఆంధ్రప్రదేశ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *