పుల్లలచెరువు మండలంలో నాటుసారా స్వాధీనం

అటవీ సమీప గ్రామాల్లో నాటుసారా ఎరులై పారుతుంది. ప్రధానంగా పశ్చిమ ప్రకాశంలోని యర్రగొండడపాలెం, పుల్లలచెరువు మండలాల్లో తీవ్రత ఎక్కువగా ఉంది. ఎక్సైజ్‌ అధికారులు దాడులు చేస్తున్నా పరిస్థితుల్లో ఏ మాత్రం మార్పు రావడం లేదు. గుట్టుచప్పుడు కాకుండా తయారు చేసి గ్రామాలకు చేర్చుతున్నారు. స్థానికులు తమ ఇళ్లలోనే నిల్వ చేసి అమ్మకాలు సాగిస్తున్నారు.

ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలంలో నాటుసారాను రహస్యంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి ఇద్దరి నుంచి సుమారు 60 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకొని ఇద్దరిపై కేసు నమోద చేశారు.

అనంతరం ఎస్సై వేముల సుధాకర్ మీడియాతో మాట్లాడుతూ పలు వివరాలను వెల్లడించారు. పుల్లలచేరువు మండలంలోని ఉమ్మడివరం గ్రామ సమీపంలో అక్రమంగా తరలిస్తున్న 60 లీటర్ల నాటుసారాను స్వాదినం చేసుకోవడం జరిగిందని…పెద్ద PRC తాండాకు చెందిన రామావత్ సోనేర నాయక్, రామావత్ రమణా నాయక్ లను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. నాటుసారాను విక్రయిస్తే కటిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Load More Related Articles
Load More By admin
Load More In ఆంధ్రప్రదేశ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *