తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నరసరావుపేట పర్యటన పురస్కరించుకుని నరసరావుపేటలో 144వ సెక్షన్ విధించారు.
నారా లోకేష్ పర్యటనకు ఎటువంటి అనుమతులు లేవని అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్టు చేయడంతో పాటు, నరసరావుపేటలో 144 సెక్షన్ విధించారు. అదే విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పార్టీ కార్యాలయం దగ్గరికి రాకుండా ఎక్కడికక్కడ బారికేడ్లు, కంచెలు ఏర్పాటు చేశారు.