చారకొండలో నిలిచిపోయిన బ్యాంకింగ్ సేవలు

నాగర్ కర్నూల్ జిల్లా చారకొండ మండల కేంద్రంలో యూనియన్ బ్యాంక్ సేవలు నిలిచిపోయాయి. ఇంటర్నెట్ సరఫరాకు అంతరాయం కలగడంతో బ్యాంకింగ్ సేవలు నిలిచిపోయాయి. దీంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

చారకొండ మండలం చుట్టూ పక్కల పలు గ్రామాలకు చెందిన ప్రజలకు ఈ బ్యాంకే దిక్కు. లావాదేవీల కోసం అనేక మంది చారకొండకు రావాల్సిందే. కాని సాంకేతిక సమస్యలు తలెత్తడంతో పూర్తిగా సేవలు నిలిచిపోయాయి. ఇక పక్క గ్రామాల నుంచి వచ్చిన వారైతే బ్యాంక్ అధికారులపై మండిపడ్డారు. వెంటనే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బ్యాంక్ ముందు భారీగా జనాలు పోగవ్వడంతో సెక్యూరిటీ సిబ్బంది బ్యాంక్ ను క్లోజ్ చేశారు. పైగా…ఏటీఎం సేవలు కూడా నిలిచిపోవడంతో వినియోగదారులు అగ్గి మీద గుగ్గిలం అయ్యారు.

Load More Related Articles
Load More By admin
Load More In తెలంగాణ

Leave a Reply

Your email address will not be published.