కరీంనగర్ లో ప్రస్తుతం పోటేట్టుతున్న వరదలకు ముఖ్యమంత్రి కేసీఆరే కారణమని మంత్రి గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత వరద భీభత్సానికి కేసీఆర్ చేసిన పనే కారణమని తేల్చేశారు ఆయన.
గతంలో గ్రౌండ్ వాటర్ ఎక్కువగా లేకపోవడంతో నగరంలో వర్షాలుపడితే ఆ నీరు నేరుగా గ్రౌండ్లోకి ఇంకిపోయి భూగర్భ జలాలుగా మారేదన్న గంగుల.. కాళేశ్వరంతో గత సీజన్ నుంచి అన్ని జలాశయాలు నిండి గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరిగిందని, అందుకే చిన్నవర్షం వచ్చిన అది వరదగా మారుతోందని విశ్లేషించారు. కాళేశ్వరంతోనే వరద నీరు ఉదృతంగా ప్రవహిస్తుందని..ఈ వరద అంతటికీ కారణం కేసీఆరేనని ఆయన తేల్చి చెప్పారు. దీంతో మంత్రి మాటలు విన్నవారంతా ఇప్పుడు నోరెళ్లబెడుతున్నాడు.
కాళేశ్వరం నీళ్లు దరిదాపుల్లో కూడా లేని పట్టణాలు కూడా నీట మునిగాయని.. అందుకు కారణం ఏమిటో కూడా ఆయన చెప్తే బాగుండని అంటున్నారు.