పశ్చిమ బెంగాల్ లో మమతాను ఓడించి సత్తా చాటాలని భావించిన బీజేపీకి నిరాశే ఎదురైంది. టీఎంసి కీలక నేతలను పార్టీలో చేర్చుకున్నా ఫలితం లేకుండా పోయింది. దేశ వ్యాప్తంగా మోడీ దూకుడును ఎదుర్కొనే సత్తా మమతా బెనర్జీకే ఉందనే అభిప్రాయాలూ వ్యక్తం అయ్యాయి. బీజేపీ అగ్రనేతలంత పశ్చిమ బెంగాల్ లో వాలి ప్రచారాన్ని హోరెత్తించినా అవేవీ బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు దోహదం చేయలేదు. అయితే, మమతా పోటీ చేసిన స్థానంలో ఓడిపోయినా టీఎంసి అధిక స్థానాలను గెలుచుకొని అధికారంలోకి వచ్చింది. దీంతో టీఎంసి కార్యకర్తలు మమతపై తమ అభిమానాని ఎదో విధంగా చాటుకుంటున్నారు.
బెంగాల్ లో ఇప్పుడు మమతను దుర్గామాతతో పోలుస్తూ విగ్రహాలు తయారు చేస్తున్నారు. బెంగాల్ లో ఎంతో అమితంగా పూజించే దుర్గామాత విగ్రహాల తయారీ వేగంగా కొనసాగుతోంది. దసరా నవరాత్రుల సందర్భంగా విగ్రహాలు ఏర్పాటు చేయబోతున్నారు. ఈ విగ్రహాల తయారీ కోసం ఏర్పాటు చేసిన కమిటీలన్ని ఇప్పుడు మమత భజన చేస్తున్నాయి. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పథకాలు పెట్టి సీఎం మమతా బెనర్జీ…. ప్రజల మనసులో కాళీ దేవీగా నిలిచిపోయారని, అందుకే దుర్గామాతగా ఆమె విగ్రహాలు ప్రతిష్టించేందుకు రెడీ చేస్తున్నట్లు నార్జుల్ పార్క్ ఉన్నాయన్ సమితి వైస్ ప్రెసిడెంట్ పార్థ సర్కార్ తెలిపారు.