ప్రారంభమైన భారత్‌ ఇంగ్లాండ్‌ నాలుగో టెస్ట్

భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య జరుగుతున్న నాల్గో టెస్ట్‌లో టీమిండియా బ్యాటింగ్‌ ఎలా ఉన్నా.. అంతర్జాతీయ క్రికెట్‌లో కొన్ని రికార్డులను బద్దలు కొట్టింది ఈ మ్యాచ్‌. టీమిండియా సారథి విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది.

అంతర్జాతీయ క్రికెట్‌లో… 23వేల పరుగులు చేసిన మూడో ఇండియన్ బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టించాడు టీమిండియా సారధి. మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్ టెండూల్కర్‌, టీమిండియా వాల్‌ రాహుల్ ద్రవిడ్‌… వన్డేలు, టెస్టుల్లో కలిపి 23వేల పరుగుల మార్క్‌ను దాటారు. తాజాగా ఈ జాబితాలో విరాట్‌ కోహ్లీ చేరాడు. 490 ఇన్నింగ్స్‌ల్లోనే 23వేల పరుగుల మార్కును చేరుకున్నాడు. 34,357 పరుగులతో టెండూల్కర్‌ తొలిస్థానంలో ఉండగా… 24,208 రన్స్‌ రాహుల్‌ ద్రవిడ్‌ రెండో స్థానంలో ఉన్నాడు. ఇక, విదేశాల్లో… ఒకే దేశంలో 10 అంతకంటే ఎక్కువ టెస్టులకు సారథ్యం వహించి తొలి ఇండియన్ కెప్టెన్‌గా రికార్డులకెక్కాడు కోహ్లీ. ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగగానే ఈ రికార్డు కోహ్లీ సొంతమైంది. ఇండియన్ కెప్టెన్‌గా కోహ్లీకి ఇంగ్లండ్‌లో ఇది పదో టెస్టు. ఆ తర్వాతి స్థానంలో మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఇంగ్లండ్‌లో 9 టెస్టులకు సారథ్యం వహించి రెండో స్థానంలో ఉండగా, సునీల్ గవాస్కర్ పాకిస్థాన్‌లో 8 టెస్టులకు సారథ్యం వహించి మూడో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో నాలుగో స్థానం కూడా కోహ్లీదే.

Load More Related Articles
Load More By admin
Load More In ఇంటర్నేషనల్

Leave a Reply

Your email address will not be published.