పవన్ వ్యాఖ్యలపై తమిళనాడు అసెంబ్లీలో ప్రస్తావన

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గురించి పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ పై అక్కడి అసెంబ్లీలో చర్చ జరిగింది. పవన్ కల్యాణ్ ట్విట్టర్ లో పెట్టిన పోస్టుని అసెంబ్లీలోనే చదివి వినిపించారు అసెంబ్లీలో డీఎంకే ఎమ్మెల్యే.
ఏ పార్టీ అయినా ప్రభుత్వంలోకి రావటానికి రాజకీయం చెయ్యాలి కానీ.. ప్రభుత్వంలోకి వచ్చాక రాజకీయం చెయ్యకూడదు” అని పవన్ కల్యాణ్ ఇటీవల తమిళనాడు సీఎం స్టాలిన్ తీసుకుంటున్న నిర్ణయాలపై స్పందిస్తూ ఓ ట్వీట్ పెట్టారు. స్టాలిన్‌కు ఓ లేఖ కూడా రాశారు. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ ట్వీట్ ఉంది. ఆ ట్వీట్ తమిళనాడులోనూ వైరల్ అయింది. అసెంబ్లీలో డీఎంకే సభ్యులు పవన్ కల్యాణ్ ట్వీట్ గురించి ప్రస్తావించారు. డీఎంకే ఎమ్మెల్యే తెలుగులోనే పవన్ కల్యాణ్ ట్విట్టర్ లో పెట్టిన పోస్టుని అసెంబ్లీలోనే చదివి వినిపించారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో డీఎంకే ఎమ్మెల్యేలంతా నవ్వుతూ కనిపించారు. స్టాలిన్ కూడా చిరునవ్వుతో ఉన్నారు. పవన్ కల్యాణ్‌తో పాటు చిరంజీవి కూడా స్టాలిన్‌ను అభినందించారు. చిరంజీవి అయితే నేరుగా వెళ్లి స్టాలిన్‌ను కలిసి వచ్చారు. స్టాలిన్ తీసుకుంటున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా హైలెట్ అవుతున్నాయి. రాజకీయ కక్షసాధింపుల జోలికి వెళ్లకుండా ప్రజాధనం ఆదా చేయడమే లక్ష్యంగా స్టాలిన్ పాలన సాగుతోందన్న అభిప్రాయం వినిపిస్తోంది.

Load More Related Articles
Load More By admin
Load More In నేషనల్

Leave a Reply

Your email address will not be published.