రాత్రి కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ జలమయమయ్యింది. ఏకదాటిగా దాదాపు మూడుగంటల పాటు వర్షం దంచికోట్టింది. దీంతో నాలాలు పొంగిపోర్లి రోడ్లన్ని చెరువుల్లా మారాయి.
ఇక లోతట్టు ప్రాంతాల్లో అయితే రోడ్డుపైనే వరదనీరు ఉద్రుతంగా ప్రవహించడంతో వాహనాలు, రోడ్డుపక్కనుండే పండ్లు, కురగాయల బండ్లు కొట్టుకుపోయాయి. ముఖ్యంగా మలక్ పెట్, సైదాబాద్, చంపాపేట్ లలో అయితే వర్షం ధాటికి వరదనీరు ఉప్పొంగి ప్రవహించింది. దీంతో మలక్ పెట్ నుంచి దిల్ సుఖ్ నగర్ వెళ్ళే వారిలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వరద నీరు రోడ్లపై ప్రమాదకర రీతిలో ప్రవహించింది. నడుములోతు నీటిలో ఇంటికి చేరుకోడానికి ప్రజలు ఇబ్బందులుపడ్డారు.