తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

తెలుగు రాష్ట్రాలను మరోసారి భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కొద్దిరోజులుగా విశ్రాంతి తీసుకున్న వరుణుడు మొన్నటి నుంచి తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు.

గురువారం రాత్రి 7-10 గంటల మధ్య కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ నగరం చిగురుటాకులా వణికిపోయింది. ఆకస్మాతుగా ముంచెత్తిన వర్షానికి నగర ప్రజలు, వీధి వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అనేక ప్రాంతాలు, కాలనీలు నీట మునిగాయి. అయితే ప్రజలను వణికించేలా వాతావరణ శాఖ మరో షాకింగ్ న్యూస్ వెల్లడించింది.
తెలంగాణలో వచ్చే నాలుగు రోజుల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. అనేక ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు, కొన్నిచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ నెల 6వ తేదీన బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని, దాని ప్రభావంతో 4-5 రోజులు హైదరాబాద్ నగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. తాజా హెచ్చరికలతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం అవుతున్నారు.

Load More Related Articles
Load More By admin
Load More In ఆంధ్రప్రదేశ్

Leave a Reply

Your email address will not be published.