తెలంగాణ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించారు సజ్జనార్. హైదరాబాద్ లోని బస్ భవన్ లో ఈ కార్యక్రమం జరిగింది.
మూడేళ్ల పాటు సైబరాబాద్ సీపీగా ఉన్న ఆయన్ను ఇటీవలే ఆర్టీసీకి బదిలీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. సజ్జనార్ గతంలో సీఐడీ, ఇంటెలిజెన్స్ విభాగాల్లో కూడా పని చేశారు. ఇప్పుడు ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టడంతో ఉద్యోగులు, పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన ఎండీగా బాధ్యతలు చేపట్టాక అయిన సంస్థలో ఎలాంటి మార్పులు ఉంటాయో చూడాలి..సమస్యల సుడిగుండంలో ఉన్న ఆర్టీసీకి.. బాస్ గా వచ్చిన సజ్జనార్.. ఎలాంటి ప్రణాళిక అమలు చేయబోతున్నారన్నది.. చాలా మందిలో ఆసక్తిని రగిలిస్తోంది. పోలీస్ అధికారిగా ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న ఆయన.. ఈ సమస్యలను ఎలా ఎన్ కౌంటర్ చేస్తారన్నది…ఇంట్రెస్టింగ్ పాయింట్ అయ్యింది.