ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి భూమి పూజ

ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణ ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ పర్యటనకు వెళ్లిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

టీఆర్ఎస్ అధినేత, సిఎం కేసీఆర్.. వసంత్ విహార్‌లో ఏర్పాటు చేయబోతున్న టీఆర్ఎస్ భవన్ పార్టీ కార్యాలయానికి భూమిపూజ చేశారు. మొత్తం 1100 గజాల స్థలంలో ఈ భవనాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఈ భూమి పూజ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులతోపాటు టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇంచార్జిలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గం సహా పలువురు ముఖ్యనేతలు హాజరయ్యారు. దీంతో ఢిల్లీలో పార్టీ కార్యాలయం నిర్మించుకున్న అతి కొద్ది ప్రాంతీయ పార్టీల జాబితాలో గులాబి పార్టీ కూడా చేరనుంది. ఇక ఈ భవన నిర్మాణాన్ని వచ్చే ఏడాది దసరా నాటికి ఎలాగైనా పూర్తిచేయాలనేది కేసీఆర్ యోచన.

Load More Related Articles
Load More By admin
Load More In తెలంగాణ

Leave a Reply

Your email address will not be published.