ఏపీ ప్రభుత్వానికి మరోసారి హైకోర్టులో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. 2014-19మధ్య ఏపీలో టీడీపీ ప్రభుత్వ హాయంలో అమరావతి రాజధాని ఎంపిక సమయంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ మాజీ ఏజీ దమ్మలపాటి శ్రీనివాస్ పై దాఖలైన కేసులను కోర్టు కొట్టివేసింది. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, బంధువులపై దాఖలైన ఎఫ్.ఆర్.ఆర్ లను కోర్టు కొట్టివేసింది.
రాజధాని వ్యవహరం ముందే తెలిసి తను, తన కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున భూములను అతి తక్కువ రేట్లకే కొనుగోలు చేశారని ఏపీ ఏసీబీ దమ్మలపాటిపై కేసులు నమోదు చేసింది. దీన్ని ఆయన హైకోర్టులో ఛాలెంజ్ చేయగా కోర్టు స్టే ఇచ్చింది. దీన్ని ప్రభుత్వం సుప్రీంలో సవాల్ చేయగా సుప్రీం కూడా హైకోర్టు తీర్పుతో ఏకీభవిస్తూ నెల రోజుల్లో కేసు విచారణను హైకోర్టే పూర్తి చేస్తుందని స్పష్టం చేసింది.
దీంతో ఏపీ హైకోర్టు తుది తీర్పు ఇస్తూ… దమ్మలపాటి సహా పలువురిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది.