నటుడుగా, రాజకీయ నాయకుడిగా తెలుగు ప్రజల్లో చెరగని ముద్రవేశారు దివంగత నటుడు నందమూరి హరికృష్ణ. అయన తృతీయ వర్ధంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఆయన అభిమానులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు హరికృష్ణకి నివాళులర్పించారు.
కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో మాజీ ఎంపీ, నటుడు నందమూరి హరికృష్ణ మూడో వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు ఆర్పించారు. జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ అభిమానులు, టైగర్ టీం సభ్యులు హరికృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలకు అందుబాటులో ఉండి ఉత్తమ సేవలు అందించి రాజకీయాల్లోనూ , సినీనటుడు గాను ప్రజల అభిమానాన్ని చూరగోన్నారని హరికృష్ణ సేవలను కొనియాడారు బోయపాటి మధు.