బైపాస్ రోడ్డు వద్దు జాతీయ బీసీ కమిషన్ సభ్యులు ఆచారికి కృతజ్ఞతలు : పవన్

నాగర్ కర్నూల్ జిల్లా చారకొండ మండల కేంద్రంలో ఉన్న రోడ్డునే విస్తరించాలని…బైపాస్ రోడ్డు వద్దని గ్రామస్తులు ముక్తకంటంతో డిమాండ్ చేస్తున్నారు. గ్రామస్తుల ఆందోళనకు బీజేపీ పార్టీ సంపూర్ణ మద్దతు తెలిపి గ్రామస్థులతో కలిసి ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే మొన్న పోలీసు బలగాల సమక్షంలో గ్రామస్తులను, బీజేపీ నేతలను అరెస్ట్ చేసి…అధికారులు సర్వే చేపట్టడంపై Obc మోర్చా మండల అద్యక్షుడు సురకారపు పవన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ విషయాన్నీ బీసీ కమిషన్ సభ్యులు ఆచారి దృష్టికి తీసుకెళ్ళామని..సెప్టెంబర్ 3న ఆయన చారకొండను సందర్శించి బైపాస్ రోడ్డు వ్యతిరేకులతో కలిసి మాట్లాడుతారని తెలిపారు పవన్.

Load More Related Articles
Load More By admin
Load More In తెలంగాణ

Leave a Reply

Your email address will not be published.