మాజీ మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రులు హరీష్, కేటీఆర్ లతోపాటు, ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోష్ రావులు టీఆర్ఎస్ ను కబ్జా పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు ఈటల.
హుజురాబాద్ లో తన గెలుపు తెలంగాణ రాజకీయాల్లో ఒక కీలక ములుపుగా మారుతుందని అభివర్ణించారు ఈటల రాజేందర్. ప్రజల్లో ఈటల రాజేందర్ ను గెలిపించాలనే కసిలో ఉన్నారన్న ఈటల…కేసీఆర్ ను ఓడగొట్టాలనే కృతనిశ్చయంతో ఉన్నారని పేర్కొన్నారు. తనేంటో తెలిసినా హరీష్ రావు కూడా తనను విమర్శించి ఆత్మ వంచన చేసుకోవద్దన్నారు. కేసీఆర్ డబ్బు, అహంకారాన్ని అడ్డుకునే సత్తా హుజురాబాద్ ప్రజలకు ఉందని…కేసీఆర్ పాచికలు ఇక్కడ పారవని అన్నారు ఈటల.
తెలంగాణలో నూతనంగా పురుడుపోసుకున్న దళిత బంధు, కొత్తగా ఆసరా పెన్షన్లు, రేషన్ కార్డుల మంజూరు, మంత్రులకు గౌరవం అంత తన రాజీనామాతోనేనని స్పష్టం చేశారు ఈటల. హుజురాబాద్ లో ఎగిరేది కాషాయ జెండా కాబట్టే…హుజురాబాద్ లో టీఆర్ఎస్ ఓడిపోతే రాష్ట్ర ప్రభుత్వం పడిపోదనే కామెంట్స్ కేటీఆర్ చేశారన్నారు.