హుజురాబాద్ లో తెలంగాణ సర్కార్ వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు యాత్రను తలపెట్టిన ఇందిరాశోభన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. యాత్ర ప్రారంభం కాకముందే పోలీసులు యాత్రకు అనుమతి లేదంటూ ఇందిరా శోభన్ ను అరెస్ట్ చేశారు. దీంతో కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
వైఎస్ఆర్ టీపీకి రాజీనామా చేసిన మహిళా నాయకురాలు ఇందిరా శోభన్ హుజురాబాద్లో ఉపాధి భరోసా యాత్రను చేపట్టాలని నిర్ణయించారు. ఈమేరకు ఈవాళ ఉదయం కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంటలో ఆమె యాత్రను ప్రరంభిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. యాత్రకు అనుమతి లేదని తెలిపారు. దీంతో ఇందిరా శోభన్ పోలీసులతో వాగ్వాదానికి దిగింది.
రెండు రోజుల కిందటే యాత్రకు పోలిసుల అనుమతి కోరామని చెప్పింది. అయినా పోలీసులు అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి…ఇప్పుడు పర్మిషన్ లేదని బుకాయిస్తున్నారని ఆమె మండిపడింది. కావాలనే తన శాంతియుత ఉపాధి పాదయాత్రకు పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆమె మండిపడుతున్నారు. కేసీఆర్ సర్కార్ ప్రజల గొంతుకలను ఎంత అణచివేసిన తన వాణిని వినిపిస్తూనే ఉంటానని ఇందిరా శోభన్ స్పష్టం చేశారు.