పార్టీ ఏర్పాటు నాటి కంటే ప్రస్తుతం మరీ బలహీనంగా కనిపిస్తోన్న వైఎస్ఆర్ టీపీ కోసం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ యాక్షన్ ప్లాన్ రెడీ చేశారా..?మరికొన్ని రోజుల్లోనే ఆయన రంగంలోకి దిగనున్నారా..? పీకే ఎంట్రీతో పార్టీ మరింత యాక్టివ్ కానుందా..? అంటే అవుననే అంటున్నాయి లోటస్ పాండ్ శ్రేణులు.
తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకోస్తానని వైఎస్ ఆర్ టీపీని నెలకొల్పారు వైఎస్ షర్మిల. మొదట్లో లోటస్ పాండ్ లో చాలా హడావిడి కనిపించేది. నిత్యం వందలాది మందితో రద్దీగా కనిపించేది. యువకులు, నాయకుల చేరికతో పార్టీ కాంగ్రెస్ స్థానాన్ని అక్రమిస్తుందా అనే అనుమానాన్ని కూడా వ్యక్తం చేశారు పరిశీలకులు. కట్ చేస్తే పార్టీ ఏర్పాటు నాటి కంటే ప్రస్తుతం పార్టీ పరిస్థితి బలహీనంగా మారింది. కీలక నేతగా ఉన్న ఇందిరా శోభన్ పార్టీకి గుడ్ బై చెప్పడంతో…వైఎస్ఆర్ టీపీ నేతల్లో ఆధిపత్య పోరు నడుస్తుందని క్లియర్ కట్ గా అర్థం అయింది. దీనిని ఆషామాషీగా తీసుకుంటే పార్టీ మరింత నష్టపోయే ప్రమాదం అయితే కనిపిస్తుందని అంటున్నారు విశ్లేషకులు.
ఈ క్రమంలోనే పార్టీ కోసం ప్రశాంత్ కిశోర్ తన అనుచర గణాన్ని రంగంలోకి దింపుతున్నట్లు లోటస్ పాండ్ శ్రేణులు చెబుతున్నాయి.