ఇటీవలే వైఎస్సార్ టీపీకి రాజీనామా చేసిన మహిళా నాయకురాలు ఇందిరా శోభన్ తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు. గన్ పార్కులో అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించిన ఆమె.. కీలక నిర్ణయాన్ని వెలువరించారు.
ఈ నెల 27 నుంచి హుజురాబాద్లో పాదయాత్ర చేయనున్నట్టు తెలిపారు ఇందిరా శోభన్. షర్మిల పార్టీ గతమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ తన మాతృపార్టీ.. పాదయాత్ర తర్వాత తన రాజకీయ నిర్ణయం ప్రకటిస్తానని వెల్లడించారు. ఉత్తమ్ కారణంగానే తాను గతంలో కాంగ్రెస్ వీడానని ఆరోపించారు.
పీసీసీ చీఫ్ గా ఉత్తమ్ చేసిందేమీ లేదని విమర్శించారు. హుజురాబాద్ లో TRS ఓటమే తన లక్ష్యమని ఇందిరా శోభన్ స్పష్టం చేశారు.