హుజురాబాద్ ఉప ఎన్నికను అధికార పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అక్కడి గెలుపోటములు పార్టీపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని కేసీఆర్ ఆలోచన. అందుకే ఈటల ఓడించేందుకు అక్కడి నుంచి కొత్త పథకాలు పురుడు పొసుకుంటున్నాయి. అయితే ఈ కొత్త పథకాల ఆలోచన అంత కేసీఆర్ ది కాదని…అదంతా పీకే మాజీ టీం సభ్యుల వ్యూహమని అనే చర్చ నడుస్తోంది.
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజకీయ వ్యూహాలు ఎంతటి తెలివితో కూడి ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన వ్యూహాలు ఎవరికీ అంతుచిక్కక ప్రతిపక్షాలు ఇన్నాళ్ళు బొక్క బోర్లా పడ్డాయి. ఇప్పటిదాకా టీఆర్ఎస్కే ఆయనే వ్యూహకర్త. ఆయన ప్లాన్ ప్రకారమే అంత నడిచింది కాని రాను రాను ఆయన వ్యూహాలు మరీ తేలిపోతున్నాయి. ఆయన మనసులో పుట్టిన పథకాలు ప్రజలపై మెదళ్లపై ప్రభావం చూపడం లేదు. కట్ చేస్తే కేసీఆర్ కోటలోకి పీకే టీమ్‌కి చెందిన ఇద్దరు మాజీ సభ్యులు ఎంట్రీ ఇచ్చారనే చర్చ జరుగుతోంది. ప్రశాంత్ కిషోర్ టీం మాజీ సభ్యుల సూచనల మేరకే కేసీఆర్ ఇప్పుడు సరికొత్త పథకాలను ప్రవేశపెడుతున్నారన్న చర్చ జరుగుతోంది.