తెలంగాణ గవర్నర్ గా మాజీ ముఖ్యమంత్రి..?

యడ్యూరప్పను కర్ణాటక ముఖ్యమంత్రి పదవి నుంచి దించేసిన బీజేపీ హైకమాండ్ ఆయను గవర్నర్ గా పంపాలని ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అందుకు యడ్యూరప్ప నిరాకరిస్తున్నట్లు సమాచారం. ఆయన అక్కడే ఉండటం హైకమాండ్ కు నచ్చడం లేదు. పైగా ఆయన అక్కడే ఉండటం వలన బీజేపీలో గ్రూప్ రాజకీయాలు ఏర్పడే అవకాశం ఉందని…అందుకే ఆయనను పట్టుబట్టి మరీ గవర్నర్ గా పంపించాలని చూస్తోంది బీజేపీ అధినాయకత్వం.

కర్ణాటక ముఖ్యమంత్రి పదవి నుంచి దించేసిన తర్వాత యడ్యూరప్పను గవర్నర్‌గా పంపాలని బీజేపీ హైకమాండ్ తీవ్రమైన ప్రయత్నాలు చేస్తోంది. కానీ గవర్నర్ పదవి వద్దని ఆయన ససేమిరా అంటున్నారు. కానీ హైకమాండ్ మాత్రం ఆయన కోసం తెలంగాణ గవర్నర్ పదవిని రెడీ చేసి ఉంచినట్లుగా తెలుస్తోంది. తెలంగాణకు గవర్నర్‌గా వెళ్లాలని ఆయనపై ఒత్తిడి పెంచుతున్నట్లుగా చెబుతున్నారు.

ప్రస్తుతం తెలంగాణ గవర్నర్ గా కొనసాగుతోన్న తమిలి సై…పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కూడా కొనసాగుతున్నారు. కేంద్ర పాలిత ప్రాంతం కావడంతో అక్కడ గవర్నర్ కు విశేశాదికారులు ఉంటాయి. దీంతో తమిళిసై పుదుచ్చేరిలోనే కొనసాగడానికి ఆసక్తి చూపిస్తున్నట్లుగా బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. యడ్యూరప్ప లాంటి నేతకు పెద్ద రాష్ట్రానికే గవర్నర్‌ను చేయాలని.. తెలంగాణ అయితే సరిపోతుందని అంచనా వేస్తున్నారు. యడ్యూరప్ప ఎప్పుడు ఒప్పుకుంటే అప్పుడు ఆయనను తెలంగాణ గవర్నర్‌గా పంపిస్తారని కర్ణాటక రాజకీయాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.

Load More Related Articles
Load More By admin
Load More In తెలంగాణ

Leave a Reply

Your email address will not be published.