కేటీఆర్ రాఖీ కట్టని కవిత-అసలు ఏం జరుగుతోంది..?

చాలా కాలంగా కేసీఆర్ గారాల పట్టీ, ఎమ్మెల్సీ కవిత సైలెంట్ గా ఉండటంపై రకరకాల చర్చలు నడిచాయి. ఆమెకు ప్రాధాన్యత దక్కకపోవడంతో అలక బూనిందని, ఎంపీ సంతోష్ రావు వైఖరి కవితకు మింగుడు పడటం లేదని అందుకే ఆమె టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో అంటీముట్టినట్లు వ్యవహరిస్తున్నారని రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చే నడిచింది. ఇదంతా ఒట్టి ప్రచారమేనని పార్టీ నేతలు కొట్టిపారేశారు. కుటుంబ సభ్యుల మధ్య చిచ్చు పెట్టేందుకే ఇలాంటి వార్తలను ప్రచారం చేస్తునారని కౌంటర్ ఇచ్చారు. కవిత, సంతోష్ రావు, కేటీఆర్ లు అంటే గిట్టని వాళ్ళే ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని స్పష్టం చేశారు. రాఖీ పండగ రోజున తెలుస్తుంది కదా…వారి మధ్య ఎలాంటి పొరపొచ్చాలు లేవనేది అంత అనుకున్నారు. తీరా రాఖీ పండగ రోజున కవిత విషెస్ తోనే సరిపెట్టగా… కేటీఆర్ కూడా కవిత శుభాకాంక్షలకు ఎలాంటి రిప్లే ఇవ్వకపోవడంతో అందరి అనుమానాలకు బలం చేకూర్చినట్టయింది.

ఎమ్మెల్సీ క‌విత ప్రగ‌తి భ‌వ‌న్‌కు ఎందుకు రాలేదు? కేటీఆర్‌కు రాఖీ క‌ట్టక‌పోవ‌డానికి కార‌ణం ఏమై ఉంటుంది? అన్న ప్రశ్నలు ఇప్పుడు అందరి మదిని తోల్చివేస్తున్నాయి. టీఆర్ఎస్ లో రాఖీ పండగ అంటేనే అందరి చూపు కేటీఆర్, కవితలపైనే ఉంటుంది. తమ అభిమాన నేతలు ఈ రాఖీ పండగను ఎలా జరుపుకుంటారోనని ఆసక్తిగా చూస్తుంటారు. కాని ఈసారి మాత్రం కవిత , కేటీఆర్ కు రాఖీ కట్టలేదు. ప్రతి ఏటా రాఖీ కట్టే కవిత ఎందుకు ఈసారి మాత్రం ఎందుకు రాఖీ కట్టలేదనేది రాజకీయ వర్గాల్లో బిగ్ డిబేట్ గా మారింది. కవిత తన పెద్ద కొడుకును డిగ్రీలో జాయిన్ చేయించేందుకు అమెరికా వెళ్ళింది. అందుకే కవిత ప్రగతి భవన్ కు వచ్చి రాఖీ కట్టలేదని పైకి చెబుతున్నా…ఆమె అలకబూనే అమెరికా వెళ్లిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే…కవిత రాఖీ పండగ సందర్భంగా ఎంపీ సంతోష్ రావు, కేటీఆర్ లకు విషెస్ చెప్పినా కేటీఆర్ రిప్లే ఇవ్వకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. పైగా కేటీఆర్ ట్విట్టర్‌లో క‌విత గురించి ఎలాంటి పోస్ట్ క‌నిపించ‌లేదు. టీఆర్ఎస్‌లో కొంద‌రు మ‌హిళా నేత‌లు త‌న‌కు రాఖీ క‌ట్టిన ఫోటోల‌ను మాత్రమే కేటీఆర్ పోస్ట్ చేశారు. దీనికి తోడు త‌న సోద‌రి క‌విత‌ బ‌ర్త్‌డే రోజు మాత్రం కేటీఆర్ ఎలాంటి ట్వీటూ చేయ‌లేదు. అప్పట్లోనే ఈ విష‌యంపై పెద్ద చ‌ర్చ జ‌రిగింది.

కవిత మౌనం గురించి ఇటీవల రకరకాల చర్చలు సాగుతున్నాయి. ప్రగతి భవన్ లో సంతోష్ రావుకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం…తండ్రిని కలిసేందుకు కూడా సంతోష్ పర్మిషన్ తీసుకోవాల్సి రావడం కవితకు ఏమాత్రం నచ్చడం లేదని టాక్. పైగా ఈ విషయంపై కేటీఆర్ కు కంప్లైంట్ చేసినా ఆయన పట్టించుకోవడం లేదని అందుకే కవిత ఇద్దరిపై అలకబూనారని పరిశీలకులు అంటున్నారు. అయితే ఈ ప్రచారాన్ని ఖండించిన‌వారూ ఉన్నారు. రాఖీ వేడుకతో ఈ అనుమానాల‌కు ఫుల్‌స్టాప్ ప‌డుతుంద‌ని చూడండంటూ చెప్పుకొచ్చారు. కేటీఆర్, సంతోష్ రావుకు క‌విత‌ రాఖీ క‌డితే.. వారి మ‌ధ్య మంచి సంబంధాలే ఉన్నాయ‌ని న‌మ్ముతారా అంటూ ప్రశ్నించారు. కానీ అలాంటి వారికి సైతం షాకిచ్చేలా తాజా ప‌రిణామం ఉండ‌టం చ‌ర్చనీయాంశంగా మారింది.

Load More Related Articles
Load More By admin
Load More In తెలంగాణ

Leave a Reply

Your email address will not be published.