మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దూకుడు పెంచింది సీబీఐ. ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన అధికారులు.. అనుమానితులతో పాటూ పలువుర్ని ప్రశ్నించింది. అలాగే సీబీఐ మరో కీలక ప్రకటన చేసింది.
వివేకా కేసుకు సంబంధించిన నమ్మకమైన సమాచారం అందించిన వారికి రూ.5లక్షలు బహుమానంగా ఇస్తామని పేపర్ ప్రకటన విడుదల చేసింది సీబీఐ. అలాగే సమాచారం అందించిన వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. సాధారణ ప్రజల నుంచి ఎవరైనా సమాచారం అందించడానికి ముందుకు రావాల్సిందిగా కోరారు. ఎవరి దగ్గరైనా వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి ఖచ్చితమైన, నమ్మదగిన సమాచారం ఉంటే దర్యాప్తు అధికారికి ఫోన్ ద్వారా సంప్రదించవచ్చన్నారు. దీపక్ గౌర్ సీబీఐ డీఎస్పీ, రామ్ సింగ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, సీబీఐ పేరుతో ప్రకటన ఇచ్చారు.