గుంటూరు జిల్లాలో ఓ ప్రేమోన్మాది నడిరోడ్డుపై రమ్యను అతికిరాతకంగా నరికి చంపాడు. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారుతోంది. ఇక ఈ ఘటనపై సామాన్యులతో పాటు సెలబ్రెటీలు సైతం స్పందిస్తున్నారు. రమ్యను పొట్టనబెట్టుకున్న శశికిరణ్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా తెలుగు హీరోయిన్ రేఖ భోజ్ సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి.

నటి రేఖ భోజ్ తన ఫేస్ బుక్ పేజీలో రమ్య హత్య గురించి భాధపడుతూ పోస్ట్ చేసింది.” వాడ్ని కూడా అలానే ఎవరైనా నరికేస్తే, ఆ నరికిన వాడితో పడుకుంటానని పేర్కొంది రేఖ భోజ్. ఐయామ్ సారీ..ఆ వీడియో చూసాక ఏం మాట్లాడుతున్నానో నాకే అర్థం కావడం లేదు.. అంత నిస్సహాయతలో వున్నాము మేము ఈ రోజు.. జిల్లాకు ఒక సజ్జనార్ సార్ కావాలి.. రమ్యా నీకు న్యాయం జరగాలి.. రెస్ట్ ఇన్ పీస్ సిస్టర్” అంటూ ‘ఊసరవెల్లి’ లోని తమన్నా పిక్ ని పోస్ట్ చేసింది.

రమ్యకు జరిగిన తీరును చూసిన ఆవేదనతోనే తాను ఇలా పోస్ట్ చేసినట్లు ఆమె వివరణ ఇచ్చారు. నెటిజన్లు తప్పుగా అనుకోవద్దని తెలిపింది. రేఖ చేసిన వ్యాఖ్యలను కొందరు సమసర్దిస్తుండగా.. మరికొందరు విమర్శిస్తున్నారు.