హుజురాబాద్ లో సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రారంభించిన తరువాత ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఈటల రాజేందర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు దళితులు.

జనరల్ గా కేసీఆర్ ఏ పథకాన్ని ప్రారంభించినా సరే.. టీఆర్ఎస్ నేతలు పాలాభిషేకాలకు రెడీ అయిపోతుంటారు. అయితే హుజురాబాద్లో అందుకు విరుద్ధమైన దృశ్యాలు కనిపించడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు ప్రకటించగానే.. అనేక గ్రామాల్లో దళితవర్గానికి చెందిన కుటుంబాలు కేసీఆర్కు బదులుగా.. ఈటల చిత్రపటానికి పాలాభిషేకాలు చేశాయి.