కేసీఆర్ ను భూమార్గం పట్టించిన ఈటల..!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు హుజురాబాద్ బైపోల్ భయం పట్టుకుందా..?దళిత బంధుతో దళితుల ఉద్దరణకు పూనుకున్నామని చెప్తున్నా…గెలుపుపై కేసీఆర్ కు నమ్మకం కలగడం లేదా…? మరో ఇరవై రోజుల్లో మండలాల్లో పర్యటిస్తానని చెప్పిన కేసీఆర్ కామెంట్స్ దేనికి సంకేతం..? ఆకాశ మార్గాన ఉన్న కేసీఆర్ ను ఈటల భూమార్గం పట్టించారా..?రీడ్ దిస్ స్టొరీ…

హుజురాబాద్ లో కేసీఆర్ ప్రసంగంలో ఆయనలో భయం, ఆందోళన కొట్టొచ్చినట్లు కనబడ్డాయని అంటున్నారు విశ్లేషకులు. ఇరవై రోజుల్లో హుజురాబాద్ లోని మండలాల్లో పర్యటిస్తానని చెప్పిన కేసీఆర్ వ్యాఖ్యలే ఇందుకు ఉదాహరణ అని పేర్కొంటున్నారు. ఇదివరకు ఎ ఉప ఎన్నిక వచ్చినా అల్లుడికో, కొడుక్కో ఆ బైపోల్ బాధ్యతను అప్పగించేవారు కేసీఆర్. కాని హుజురాబాద్ లో మాత్రం అల్లుడిని నమ్ముకోకుండా…కొడుకును వ్యూహాత్మకంగా వెనకే ఉంచి అన్ని తానై రంగంలోకి దిగుతున్నారు గులాబీ బాస్. దళిత బంధుతో హుజురాబాద్ లో ఈజీగా నెగ్గోచ్చునని అనుకున్నా…గెలుపు అంత సునాయాసం కాదనే హెచ్చరికల నేపథ్యంలో మండల పర్యటనలకు శ్రీకారం చుడుతున్నారు కేసీఆర్.

ఎలాగైనా, ఎదో ఒకటి చేసైనా ఈటల ఓడించాలి కేసీఆర్ టార్గెట్ ఇదే. లెక్క తప్పిందే అనుకో…నివురు గప్పిన నిప్పులా ఉన్నా పార్టీలో అసంమత్తి స్వరాలూ ఎలా భాగ్గుమంటాయో కేసీఆర్ కు బాగా తెలుసు. దీనిని అంచనా వేసిన గులాబీ దళపతి…హుజురాబాద్ కు దండయాత్రగా వెళ్లి వెళ్లి ఈటల మనోస్థైర్యాన్ని దెబ్బతీసి… నియోజకవర్గంపై ఆయనకున్న పట్టును దెబ్బ తీయాలనే రాజకీయ లక్ష్యంగా కేసీఆర్ సభ జరిగిందని విశ్లేషణ చేస్తున్నారు. హుజూరాబాద్ సభలో కేసీఆర్ ఉపన్యాసం చూస్తుంటే ఆద్యంతం తనలో అంతర్లీనంగా దాగి ఉన్న ఓటమి భయం, ఆందోళన బయట పడ్డాయిని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

దళితులకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదనే పాయింట్ ను మెయిన్ గా రేస్ చేస్తున్నాయి ప్రతిపక్షాలు. ఇదే విషయం హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల హృదయాలకు తాకితే మాత్రం టీఆర్ఎస్ కు పరాభవం తప్పదు. పైగా అభినవ అంబేద్కర్ అని ప్రశంసలు అందుకుంటున్నా కేసీఆర్… తాను ముఖ్యమంత్రి అయ్యాక ఏనాడూ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహానికి దండవేసి దండం పెట్టకుండా రాజ్యాంగ నిర్మాతనే అవమానించారని… 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెడతామని, నేటివరకు ఏర్పాటు చేయకుండా ఆలస్యం చేశారని… పార్టీ కార్యాలయంలో ఉన్న చిత్రపటాన్ని తీయించారనే అంశం…ఇవన్నీ కేసీఆర్ లో ఆందోళన పెంచుతున్నట్లు కనిపించాయని అంటున్నారు విశ్లేషకులు. ఇలా అనేక భయాలు, ఆందోళనలు మనసులో పెట్టుకొని కేసీఆర్ సభలో మాట్లాడినట్లుగా ఉందని విశ్లేషిస్తున్నారు.

గులాబీ బాస్ లోని ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ ను కవర్ చేసుకునేందుకు… ఇతరులపై దాడి చేయడం ద్వారా పైకి సుపీరియర్ కాంప్లెక్స్ ను ప్రదర్శించారని అంటున్నారు విశ్లేషకులు. ఇక, మండలాల వారీగా పర్యటిస్తానని కేసీఆర్ ప్రకటన వెనక ఈటల విజయం దాగి ఉందని అంటున్నారు విశ్లేషకులు. మొత్తం ఫాం హౌస్ టూ ప్రగతి భవన్ ముద్ర వేసుకున్నా కేసీఆర్ ప్రజల్లోకి వెళ్ళాలనే నిర్ణయం ఈటల రాజీనామాతోనే సాధ్యం అయిందని అంటున్నారు. తనకు ఎదురు లేదనుకున్నా కేసీఆర్ ను ఈటల…భూమార్గం పట్టించారని చెబుతున్నారు విశ్లేషకులు.

Load More Related Articles
Load More By admin
Load More In తెలంగాణ

Leave a Reply

Your email address will not be published.