ఏపీ సర్కార్ కీలక నిర్ణయం-ఇక అంత రహస్యమే..

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉత్తర్వులు జీవోలను ఇకపై ఆన్ లైన్ లో పెట్టకూడదని సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పరిపాలన శాఖ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. జీవోలను ప్రభుత్వ వెబ్ సైట్లలో ఉంచే ప్రక్రియ 2008లో ప్రారంభమైంది. ప్రభుత్వ నిర్ణయాలు ప్రజలకు తెలియాలని, పారదర్శకత ఉండాలని అప్పటి సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. ఆ తరువాత ప్రభుత్వాలు మారినా ఈ ప్రక్రియను మాత్రం కొనసాగిస్తూనే వచ్చాయి. తాజాగా జగన్ సర్కార్ ఈ విధానానికి స్వస్తి పలికింది. ప్రభుత్వ బిజినెస్ రూల్స్ ప్రకారం జీవోలను పబ్లిక్ డొమైన్ లో పెట్టకూడదని నిర్ణయించింది. జీవోలను వెబ్ సైట్లలో ఉంచొద్దని అన్ని శాఖల కార్యదర్శులకు ఆదేశాలు ఇచ్చింది.

ఏపీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ప్రభుత్వం తన కార్యకలాపాలను అంత రహస్యంగా, ప్రజలకు తెలియకుండా చేయాలనుకోవడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని అంటున్నాయి.

Load More Related Articles
Load More By admin
Load More In ఆంధ్రప్రదేశ్

Leave a Reply

Your email address will not be published.