మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి మూడో వర్ధంతి సందర్భంగా రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోడీ సహా పలువురు నేతలు ఘనంగా నివాళులు అర్పించారు.
భారత మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజపేయి మూడో వర్ధంతి సందర్భంగా రాజకీయ ప్రముఖులంతా ఘన నివాళులర్పించారు. ఢిల్లీలోని అటల్ సమాధి వద్దకు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ అక్కడ పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. దేశానికి వాజ్ పేయి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు ప్రధాని.