తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోన్న దళిత బంధుపై సొంత పార్టీ నుంచే రుసరు సుసలు వినిపిస్తున్నాయి. ఇన్నాళ్లు కేసీఆర్ ను ఆకాశానికేత్తేసిన నేతలకు ఆల్ ఆఫ్ సడెన్ గా పొలిటికల్ ఫీవర్ పట్టుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా నిరసన సెగలను చూస్తోంటే… కేసీఆర్ వెనకా ముందు ఆలోచించకుండా ఈ దళిత బంధును తీసుకొచ్చారా అని లోలోపల రగిలిపోతున్నారట.
దళిత బంధు గురించి కేసీఆర్ మొదట ప్రకటన చేయగానే మరోసారి తమకు ఎ డోఖా లేదనుకున్నారు ఎమ్మెల్యేలు. వచ్చే ఎన్నికల్లో కూడా సునాసయసంగా గెలువచ్చునని ఉబ్బితబ్బిపోయారు. సీన్ కట్ చేస్తే…తాజా పరిస్థితులను చూసి తల్లాడిల్లుతున్నారు. ఓ వైపు తమ నియోజకవర్గాల్లో దళితులు తమకెప్పుడు దళిత బంధు ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. దళితులకి ఇచ్చి తమకు మాత్రం మొండిచేయి చూపుతారా అంటూ మిగిలిన వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నియోజకవర్గాల్లో ఎక్కడికైనా వెళ్దామంటే ఇవే ప్రశ్నలు వస్తు ఉండటంతో ఎమ్మెల్యేల్లో భయం పట్టుకుంది. దీంతో గాలికిపోయే ముళ్ల కంపనేమైనా వెనక తగిలించుకుంటున్నామా అన్న సందేహాలు టీఆర్ఎస్ నేతల్లో వ్యక్తమవుతున్నాయి.