తెలంగాణ సీఎం కార్యాలయంలో దళిత అధికారులు ఒక్కరు లేరని విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి. దళిత సంఘాలు, ప్రజా సంఘాలు, ప్రతిపక్షాలు ప్రధానంగా ఈ పాయింట్ ను రేస్ చేస్తూ విమర్శలను గుప్పించాయి. ఈ క్రమంలోనే ఈ అపప్రదను తొలగించుకునేందుకు కేసీఆర్ హుజురాబాద్ వేదికగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐఎస్ఎస్ అధికారి అయిన రాహుల్ బొజ్జాను సీఎంవో సెక్రటరీగా నియమిస్తున్నట్లు ప్రకటించారు కేసీఆర్. అక్కడి నుంచే దళిత సంక్షేమ వ్యవహారాలను చూడాలని కేసీఆర్ ప్రకటించారు.

ప్రతిపక్షాలు, దళిత సంఘాల విమర్శలు కేసీఆర్ కు బాగానే తాకినట్టు ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు. అందుకే సడెన్ గా కేసీఆర్…రాహుల్ బోజ్జాను ముఖ్యమంత్రి కార్యాలయ అధికారిగా నియమించారని అంటున్నారు.