ఆఫ్గనిస్థాన్ను తాలిబన్లు తమ ఆధీనంలోకి తీసుకోవడంతో భారీ సంఖ్యలో జనం ప్రాణభయంతో ఆ దేశం నుంచి పారిపోతున్నారు. భారీ సంఖ్యలో విదేశీయులు, సొంత దేశానికి చెందినవారు విదేశీ విమానం కోసం కాబుల్ విమానాశ్రయం చేరుకున్నారు. దీంతో విమానాశ్రయం జనంతో కిక్కిరిసిపోయింది.
రాత్రంతా విమానాల కోసం పడిగాపులు కాచారు. అక్కడ ఏ విమానం కనిపించినా అందులో ఎక్కి ప్రాణాలతో బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు. టిక్కెట్ ఎంతైనా ఇచ్చేందుకు సిద్ధం…తమకు విమానంలో టిక్కెట్ ఇవ్వాలని వేడుకుంటున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నారు. వందలాది మంది విమానం ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి.