ఆఫ్గనిస్తాన్ లో భయంకరమైన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఆఫ్గాన్ లోని ఒక్కో ప్రాంతాన్ని తాలిబన్లు తమ కంట్రోల్ లోకి తీసుకుంటున్నారు. తాలిబన్లతో ఆఫ్గాన్ సైన్యం సర్వశక్తులు ఒడ్డుతోంది. ఈ క్రమంలోనే ఆఫ్గాన్ లో భీకరమైన యుద్ద కాండ కొనసాగుతోంది. తాలిబన్లకు, ఆఫ్గాన్ సైన్యానికి జరుగుతున్న వార్ లో అమాయక ప్రజలు బలి అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆఫ్గాన్ లో నెలకొన్న పరిస్థితులపై క్రికెటర్ రషీద్ ఖాన్ ట్వీట్ చేశారు.

తమ దేశం రావణకాష్టంలా మారిందని…ఈ పరిస్థితులను చూసి తట్టుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రపంచ పెద్దలారా…మా దేశంలో సాధారణ పౌరుల జీవితాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. రోజూ వేలాది మంది మరణిస్తున్నారు. మమ్మల్ని అనాధలా వదిలేయకండి. ఆఫ్ఘన్ల హత్యలను, ఆఫ్ఘనిస్థాన్ విధ్వంసాన్ని ఆపండని ఆవేదనతో ట్వీట్ చేశాడు రషీద్ ఖాన్.