చాలా తక్కువసేపు అత్యాచారమట – శిక్షను తగ్గించిన న్యాయస్థానం

తక్కువ సమయం మాత్రమె అత్యచారం జరిగిందని న్యాయస్థానం నిందితుడికి శిక్షను తగ్గిస్తూ వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. అత్యాచారం కేసులో శిక్ష పడిన ఓ నిందితుడికి అప్పీల్ కోర్టు శిక్షను తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశం అవుతోంది. అత్యాచారం కేవలం 11 నిముషాలు మత్రమే జరిగిందని, పైగా బాధితురాలికి గాయాలు కూడా కానందున శిక్షను తగ్గిస్తున్నట్టు కోర్టు నిర్ణయం తీసుకుందని అక్కడి మీడియా పేర్కొంది.

కాగా…అక్కడి న్యాయస్థాన తీర్పును తీవ్రంగా తప్పుబడుతున్నాయి మహిళా సంఘాలు. 11 నిమిషాలు అత్యాచారం చేస్తే అది అత్యాచారం కాదా…అసలు కోర్టు ఉద్దేశ్యం ఎంటని కోర్టును చుట్టుముట్టి నిరసన తెలిపారు. పలానా సమయం సేపు అత్యాచారం చేస్తేనే దానిని అత్యచారంగా పరిగణిస్తారా..?అని ప్రశ్నించారు.

ఇంతకీ ఎం జరిగిందంటే..పోయిన ఏడాది ఫిబ్రవరిలో ఓ క్లబ్ నుంచి బయటకు వస్తోన్న మహిళపై యువకుడు, అతని వెంట ఉన్న 17 ఏళ్ల బాలుడు అత్యాచారం చేశారు. ఈ కేసులో యువకుడికి నాలుగు సంవత్సర నాలుగు నెలల జైలు శిక్షను విధించింది కోర్టు. తనకు విధించిన శిక్షను సవాల్ చేస్తూ నిందితుడు అప్పీల్ కోర్టుకు వెళ్ళాడు. అక్కడ విచారణ చేపట్టిన న్యాయస్థానం అత్యాచారం కేవలం 11 నిమిషాల పాటు మాత్రమే జరిగిందని…నిందితుడి శిక్షను తగ్గిస్తూ తీర్పును వెలువరించింది. నాలుగు సంవ‌త్సరాల మూడు నెల‌లు జైలు శిక్షను మూడేళ్ళకు తగ్గించింది అప్పీల్ కోర్టు. ఈ తీర్పును తప్పుబట్టారు బాధితురాలి తరుపు న్యాయవాది. స్విట్జర్లాండ్ లో చోటుచేసుకున్న ఈ ఘ‌ట‌న తీవ్ర దుమారం రేపుతోంది.

Load More Related Articles
Load More By admin
Load More In ఇంటర్నేషనల్

Leave a Reply

Your email address will not be published.