వేములవాడలో ఉప ఎన్నిక-హైకోర్టు కీలక వ్యాఖ్యలు

వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వ విషయంలో తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా వాడివేడిగా జరిగిన వాదనలు విన్న న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. వేములవాడలో ఉప ఎన్నికకు రెడీ అవ్వాలని వ్యాఖ్యానించింది. దీంతో చెన్నమనేని తరపు న్యాయవాది స్పందిస్తూ…దీనిపై చెన్నమనేనిని సంప్రదించి పూర్తి స్థాయిలో వాదనలు వినిపిస్తామని న్యాయస్థానానికి నివేదించారు. దీంతో తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. ఆ రోజు ఎం జరుగుతుందోనాన్న ఉత్కంట నెలకొంది.

Telangana High Court hears Chennamaneni Ramesh's citizenship plea

చెన్నమనేని పౌరసత్వపై జరిగిన విచారణ సందర్భంగా హైకోర్టులో ఆసక్తి కరమైన వాదనలు కొనసాగాయి. పిటిషనర్ ఆది శ్రీనివాస్ తరుపున న్యాయవాది రవి కిరణ్ , కేంద్ర ప్రభుత్వం తరపున అసిస్టెంట్ సొలిసెట‌ర్ జనరల్ రాజేశ్వర్ రావు తమ వాదనలను వినిపించారు. 2019లో బెర్లిన్‌లో ఇండియన్ ఎంబ‌సీ ద్వారా చెన్నమనేని ఓసీఐ కార్డ్ తీసుకున్నార‌నిరవి కిరణ్ కోర్టుకు తెలిపారు. ఓసీఐ దరఖాస్తు ఫామ్ -10 కాల‌మ్‌లో చెన్నమ‌నేని త‌న నేషనాలిటిని జర్మనీగా ప్రస్తావించార‌ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అప్పటి నుంచి ఓసీఐ కార్డ్ మీద ఇండియాకు వ‌స్తూ…జర్మనీ పాస్‌పోర్ట్ మీద చెన్నమనేని జర్మనీకి వెళ్తున్నారని కోర్టుకు తెలిపారు. చెన్నమనేని భారతీయుడు అయితే …జర్మనీ పాస్ పోర్ట్‌ను 2023 వరకు ఎలా పొడిగించుకోగలరన్న సందేహాన్ని కోర్టు ముందుంచారు. ఇండియ‌న్ అయితే… ఇండియా పాస్ పోర్ట్‌పై ప్రయాణం చేయాలి కానీ జర్మనీ పాస్ పోర్ట్‌పై ప్రయాణాలు చేస్తున్నార‌ని కోర్టుకు తెలిపారు. ర‌వికిర‌ణ్ వాద‌న‌లు విన్న తరువాత… ఓసీఐ కార్డ్‌లో త‌న జాతీయతను జ‌ర్మనీ అని ఎలా పేర్కొన్నారని చెన్నమ‌నేని ప్రశ్నించింది హైకోర్టు. ఈ సందర్భంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఎన్నికలకు సిద్దం కావాలని సూచించింది. అయితే చెన్నమ‌నేని త‌ర‌పు న్యాయ‌వాది జోక్యంతో తదుపరి విచారణను ఆగస్టు 24 కు వాయిదా వేసింది.

Load More Related Articles
Load More By admin
Load More In తెలంగాణ

Leave a Reply

Your email address will not be published.