దళిత బంధుకు ఐదు వందల కోట్లు-ఏ క్షణమైనా నోటిఫికేషన్..?

దళిత బంధును ముందు పెట్టి హుజురాబాద్ లో ఓట్లను దండుకోవాలని చూస్తున్న కేసీఆర్…అందుకు ఎలాంటి అడ్డంకులు రాకుండా ముందు జాగ్రత్త పడుతున్నారు. కోర్టు కేసులు, ఈసీ ఆదేశాలతో ఈ పథకం ఆగిపోతే అసలుకే ఎసరు వస్తుందని భావించి…ముందస్తుగా ముందుకు సాగుతున్నారు.

జెండా పండగ ఆగస్ట్ పదిహేనున అట్టహాంగా దళిత బంధును ప్రారంభిస్తామని ప్రకటించిన కేసీఆర్…ఎందుకైనా మంచిదని ముందుగానే నిధులను విడుదల చేశారు.పైలెట్ ప్రాజెక్టు కింద హుజురాబాద్ ను ఎంచుకున్న ప్రభుత్వం ఈమేరకు విధించుకున్న డెడ్ లైన్ కంటే ముందుగానే నిధులను విడుదల చేస్తూ జీవో జారీ చేసింది. 500 కోట్లను విడుదల చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.

కాకపోతే ఇంత సడెన్ గా ముఖ్యమంత్రి నిధుల విడుదలకు ఉత్సాహం చూపించడం అనేక అనుమానాల‌కు తావిస్తోంది. త్వర‌లోనే హుజురాబాద్ బైపోల్ కు నోటిఫికేష‌న్ వ‌చ్చే అవ‌కాశం ఉన్నందునే… ఆగ‌మేఘాల మీద కేసీఆర్ నిధుల‌ను మంజూరు చేశార‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. ఏ క్షణ‌మైనా నోటిఫికేష‌న్, ఆ వెంటనే ఎలక్షన్ కోడ్ అమల్లోకి వ‌చ్చే అవ‌కాశం ఉండ‌టంతోనే…కేసీఆర్ ఇలా త‌న ప్లాన్‌ను ముందే అమ‌ల్లోకి తీసుకొస్తున్నారేమోనని అంటున్నారు విశ్లేషకులు.

Load More Related Articles
Load More By admin
Load More In తెలంగాణ

Leave a Reply

Your email address will not be published.