కేసీఆర్ మీకు అర్థం అవుతోందా- దళితులను అవమానిస్తారా..?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులను అవమానిస్తున్నారా..? దళిత సాధికారిత కోసమే దళిత బంధు పథకమని చెప్తున్నా కేసీఆర్…వారిని ఉద్దేశ్యపూర్వకంగా అవమానిస్తున్నారా..?అంటే అవుననే అంటున్నాయి దళిత సంఘాలు.

దళితులు అంటేనే చిన్నచూపు కేసీఆర్ కు సడెన్ గా ఆ సామజిక వర్గం గుర్తుకు రావడం ఆశ్చర్యంగా ఉందంటున్నాయి దళిత సంఘాలు. అవకాశం దొరికినా ప్రతిసారి పరోక్షంగా దళితులను పరోక్షంగా కించపరిచే కేసీఆర్..ఇప్పుడు దళిత బంధుతో మరోసారి అవమాన పరుస్తున్నారని అంటున్నారు. దళితులు అనే పదాన్ని ఉపయోగించవద్దని కేంద్రం ఎప్పుడో ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రంతోపాటు ఏ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దళితులు అనే పదాన్ని ఎ ఇతర సందర్భాల్లో కాని, కార్యక్రమాల్లో కాని ఉపయోగించవద్దని 2018 మార్చి 15న‌ క‌ఠిన ఆదేశాలు జారీ చేసింది.

దళిత అనే పదం ఉపయోగించకుండా రాజ్యాంగంలో పేర్కొన్న ‘షెడ్యూల్డ్‌ కులాలు’ అనే పదం వాడాలని కేంద్ర సూచించిన‌ట్టు గుర్తు చేస్తున్నారు మేధావులు. కాని కేసీఆర్ మాత్రం అవేవీ పట్టించుకోకుండా ఎస్సీల ఉద్దరణకు ప్రవేశపెడుతున పథకానికి దళిత బంధు పేరు పెట్టడం వారిని అవమానించడమే అవుతుందని అంటున్నారు దళిత సంఘాల నాయకులూ. సాధికారిత పేరిట వారిని కించపరుస్తున్నారని మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కేంద్రం ఆదేశాలను పట్టించుకోకుండా ఇలా చేయడం సరైంది కాదని కేసీఆర్ వైఖరిని తప్పుబడుతున్నారు. ద‌ళిత జాతి హ‌క్కుల కోసం పోరాడిన ఎంతో మంది దేశంలో, రాష్ట్రంలో ఉన్నార‌ని.. వారి పేరుతో ఈ ప‌థ‌కాన్ని పెట్టొచ్చని సూచిస్తున్నారు.

Load More Related Articles
Load More By admin
Load More In తెలంగాణ

Leave a Reply

Your email address will not be published.