మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేడు బహుజన సమాజ్ పార్టీలో చేరనున్నారు. నల్గొండ ఎన్ జీ కళాశాల మైదానంలో జరగనున్న నిర్వహించనున్న రాజ్యాధికార సంకల్ప సభలో ఆయన బీఎస్పీ తీర్ధం పుచ్చుకోనున్నారు. ఈ సభకు ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు రాంజీ గౌతమ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. విశిష్ట అతిథిగా రాష్ట్ర అద్యక్షుడు మంద ప్రభాకర్ ప్రత్యేక అతిథిగా హాజరు కానున్నారు. ఈ సభకు లక్షలాది మంది హాజరు కానున్నారు.
అక్షరం, ఆర్థికం, ఆత్మగౌరవం నినాదంతో బీఎస్పీలో చేరుతున్నట్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. అత్యధిక జనాభా ఉన్న బీసీ, దళితులకు మాత్రం రాజ్యాధికారం అందని ద్రాక్షగా మిగిలిపోయిందని…అణచబడిన కులాలకు రాజ్యాధికారం అందించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు ఆయన. దళిత, బహుజనులను రాజ్యాధికార సాధనలో అగ్రకులాలు వాడుకోవడం మినహా…వారికీ చేసిందేమీ లేదన్నారు. ఆరేళ్ళ సర్వీసు ఉండగానే ఐపీఎస్ అధికారిగా వీఆర్ఎస్ తీసుకోవడానికి ప్రధాన కారణం ఇదేనని ఆర్ఎస్ స్పష్టం చేశారు. గురుకులాల కార్యదర్శిగా కొంతే చేశానని ఇంకా ఎంతోమందికి చేయాల్సింది ఉన్నదని భావించే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.