ఏపీలో వాడివేడిగా ఉన్న రాజకీయం నిన్న మంత్రి పెర్ని నాని చేసిన కామెంట్స్ తో తారాస్థాయికి చేరింది. వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని పేర్ని నాని చేసిన కామెంట్స్ కు బీజేపీ నేతలు బదులిస్తూ…మీ ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం లేదని , మీరే పాతలమంత గొయ్యి తవ్వి రెడీగా ఉంచుకున్నారని కౌంటర్ ఇచ్చారు.
ఏపీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్రలు చేస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి పేర్ని నాని. ఒక్కసారిగా ఆయన ఈ కామెంట్స్ చేయడం కలకలం రేపింది. అయితే…ఈ కామెంట్స్ కు బీజేపీ నేతలు ఘాటుగానే బదులిచ్చారు. మీ ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు సునీల్ దేవధర్. ఎ క్షణాన బెయిల్ రాద్దౌతుందో తెలియక…రోజు గడవడానికి అప్పు పుట్టాక, రాష్ట్ర ప్రజలను అప్పుల ఊబిలోకి నెట్టి…అది చాలదన్నట్లు వేల కోట్ల అవినీహి చేసి మీ ప్రభుత్వానికి మీరే పాతాలమంత లోతు గొయ్యి తవ్వి రెడీగా ఉందంటూ ఘాటుగా రిప్లై ఇచ్చారు. కౌంటర్, రివర్స్ కౌంటర్ లతో ఏపీ రాజకీయం మరోసారి వేడెక్కింది.