దళిత బంధుపై చర్చించేందుకు అసెంబ్లీ సమావేశాలు..?

దళిత బంధుపై ఇప్పటికే దళిత నేతలు, ప్రజా సంఘాల నాయకులతో సమావేశమైన సిఎం కేసీఆర్…ఇప్పుడు అసెంబ్లీ వేదికగా ఈ అంశంపై చర్చించాలని అనుకుంటున్నారు. ఈ నెల 16న హుజురాబాద్ లో దళిత బంధును లాంచనంగా ప్రారంభించడానికి రెండు రోజుల ముందే ఆయన అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తద్వారా ఈ అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చ జరిగేలా చేసి…హుజురాబాద్ లో దళితుల ఓట్లను గంపగుత్తగా రాబట్టవచ్చుననే యోచనలో కేసీఆర్ ఉన్నారని అంటున్నారు విశ్లేషకులు.

దళిత బందును చట్టబడద్దత కల్పిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వాసాలమర్రి పర్యటనలో తెలిపారు. భవిష్యత్ లో ఏ పార్టీలు అధికారంలోకి వచ్చినా…ఈ పథకాన్ని చివరి వ్యక్తికి అందె వరకు కొనసాగించేలా చట్టభద్రత కల్పిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ఆయన వ్యాఖ్యలను బట్టి చూస్తె ఈ పథకాన్నికి చట్ట భద్రత కల్పించాలనే యోచనలో కేసీఆర్ ఉన్నారని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే ఈ నెల 16న లాంచనంగా హుజురాబాద్ లో దళిత బంధును ప్రారంభించడానికి రెండు రోజుల ముందే అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని కేసీఆర్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

మొదటి రోజు శాసన సభలో ఈ పథకంపై చర్చించి…మరుసటి రోజు మండలిలో చర్చించి దళిత బంధుకు చట్టభద్రత కల్పించాలనే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. మరో వైపు ఈ పథకానికి చట్ట భద్రత కల్పించి దళిత మనస్సులను గెలుచుకోవచ్చుననే ప్లాన్ లో కేసీఆర్ ఉన్నారు. మరో వైపు..అసెంబ్లీ ఈ పథకానికి సంబంధించి చర్చ జరిగితే…ప్రతిపక్షాలు ఎలాగు ఈ పథకానికి సపోర్ట్ చేయాల్సిన ఉంటుంది. ప్రతిపక్షాల నోటికి కూడా తాళం వేసినట్లు అవుతుందనే వ్యూహంలో గులాబీ దళపతి ఉన్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే…కేసీఆర్ వ్యూహాలను పసిగట్టిన ప్రతిపక్షాలు…ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితులందరికీ దళిత బంధును వర్తింప జేయాలని డిమాండ్ చేస్తూ కేసీఆర్ ను ఇరుకున పెట్టేలా అస్త్ర శాస్త్రలను రూపొందిస్తున్నాయి. చూడాలి మరి ఎం జరుగుతుందో…

Load More Related Articles
Load More By admin
Load More In తెలంగాణ

Leave a Reply

Your email address will not be published.