ఏపీ బీజేపీ అద్యక్షుడిని మార్చాలని అధినాయకత్వం భావిస్తోందా…?ఆ ప్లేసులో ఎవరిని కూర్చోబెట్టాలనే విషయంలో జాతీయ నాయకత్వం సంప్రదింపులు కూడా షురూ చేసిందా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి.
ఏపీ బీజేపీ అద్యక్షుడిగా సోము వీర్రాజుగా విఫలమైయ్యారని జాతీయ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీ బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ మురళీధరన్, ఆర్ఎస్ఎస్ తరుపున ఏపీ వ్యవహారాలను చూసుకోవడానికి కొత్తగా నియామకం అయిన పరిశీలకుడు ఏపీలో పార్టీని పరిస్థితిపై జాతీయ నాయకత్వానికి నివేదిక పంపినట్లు తెలుస్తోంది. సోము నాయకత్వంలో అనుకున్న మేర పార్టీ బలోపేతం కాలేదని..పైగా పార్టీ కార్యకర్తల్లో నిస్తేజం నెలకొందని…నాయకత్వాన్ని అలాగే కొనసాగిస్తే ఏపీలో బలపడాలని అనుకుంటున్నా మన ఆశలు అడియాశలు అవుతాయని నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీంతో అధినాయకత్వం సోము వీర్రాజును తప్పించి ఆయన స్థానంలో మరొకరికి భాద్యతలు కట్టబెట్టాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది.

అనేక పేర్లను పరిశీలించిన తరువాత ఇద్దరితో షార్ట్ లిస్టు రెడీ చేసినట్లు తెలుస్తోంది, అందులో రాయలసీమకు చెందిన ఆది నారాయణ రెడ్డి, ఇదివరకు బాధ్యతలు నిర్వర్తించిన కన్నా లక్ష్మి నారాయణ పేర్లు ఉన్నాట్లు సమాచారం. రాయలసీమకు చెందినా నేతకు పార్టీ అద్యక్ష బాధ్యతలు కట్టబెట్టనందున ఈసారి ఆది నారాయణ రెడ్డికి ప్రెసిడెంట్ పోస్ట్‌ను అప్పగించాలని చూస్తున్నారని తెలుస్తోంది. అయితే…ఆయనకు బాధ్యతలు అప్పగిస్తే సీనియర్లు అభ్యంతరం చెప్పే అవకాశం ఉండటంతో…కన్నా లక్ష్మి నారాయణను మరో ఆప్షన్ గా ఎంచుకుంది అధిష్టానం. వారంలో ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడు వచ్చే అవకాశం ఉందంటున్నారు.చూడాలి మరి ఇద్దరిలో ఎవరికీ అవకాశం దక్కుతుందో….