తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధుపై హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు అయింది. ఈ పిటిషన్ పై అత్యవసర విచారణ చేపట్టాలన్న పిటిషనర్ అభ్యర్థనను ధర్మాసనం కొట్టివేసింది.దళిత బంధుపై తెలంగాణ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు అయింది.
కేసీఆర్ దత్తత గ్రామమైన వాసాలమర్రిలో దళిత బంధు కోసం ప్రభుత్వం 7.60 కోట్ల రూపాయల విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ సుంకర నరేష్ అనే న్యాయవాది ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈమేరకు లంచ్ మోషన్ కోరారు. దళిత బంధుపై దాఖలు చేసిన పిటిషన్ ను అత్యవసరంగా విచారించలేమని ధర్మాసనం పేర్కొంది. ఇదే అంశంపై ఆల్రెడీ పిటిషన్ దాఖలు అయిందని కనుక…అత్యవసరంగా విచారణ చేపట్టలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇదివరకు దాఖలు అయిన పిటిషన్ ను కూడా అత్యవసరంగా విచారణ చేపట్టాలని కోరినా..అప్పుడు కూడా కోర్టు నిరాకరించింది.