హుజురాబాద్ నేత పాడి కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వడం పార్టీలోని సీనియర్లకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. ఆ పదవి కోసమే ఎదురు చూస్తుండగా కౌశిక్ రెడ్డి ఎగరేసుకుపోవడంతో సీనియర్లు రగిలిపోతున్నారు. నిన్న కాకా మొన్న పార్టీలో చేరిన వ్యక్తికి సడెన్ గా ఎమ్మెల్సీ కట్టబెట్టి…పార్టీ కోసమే పని చేస్తున్న తమను మాత్రం పట్టించుకోకపోడంపై కేసీఆర్ పై గుర్రుగా ఉన్నారు.
పార్టీలో చేరి 15 రోజులు గడవక ముందే పాడి కౌశిక్ రెడ్డిని కేసీఆర్ ఎమ్మెల్సీగా నియమింఛడాన్ని పార్టీలోని సీనియర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీ కోసం దశాబ్దాలుగా పని చేస్తున్న తమ కృషిని పట్టించుకోకుండా…పక్క పార్టీలో నుంచి వచ్చిన కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టడం ఏంటని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
మరో వైపు ఉద్యమ సమయంలో జగన్ పంచన చేరి ఉద్యమకారులపై రాళ్ళు విసిరినా కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీ ఎలా చెస్తారంటూ పార్టీలో కొంతమంది అంతర్గతంగా ప్రశ్నిస్తున్నారట. ఉద్యమకారుల రక్తాన్ని చూసిన వ్యక్తికి ఎమ్మెల్సీ కట్టబెట్టడంతో జనాల్లోకి ఎలాంటి మెసేజ్ ను కేసీఆర్ పంపదల్చుకున్నారని అంటున్నారు బీజేపీ నేతలు. పైగా కౌశిక్ రెడ్డిపై చాలా కేసులు ఉన్నాయని…వాటిన్నింటిని అర్హతగా తీసుకొని ఎమ్మెల్సీ ఇచ్చారేమో అని సెటైర్లు వేస్తున్నారు.