ఈ లెక్కన- హుజురాబాద్ లో దళిత బంధు లేనట్టేనా సారూ..!

దళిత బందును హుజురాబాద్ లో కాకుండా వాసాలమర్రిలో ప్రారంభించడంపై సిఎం కేసీఆర్ ప్లాన్ ఏంటై ఉంటుందని అంత చర్చిస్తున్నారు. రాత్రికి రాత్రే జీవో జారీ చేయడానికి గల కారణం ఏంటని అంత చర్చోపచర్చలు స్టార్ట్ చేశారు. దత్తత గ్రామం కనుక కేసీఆర్ ప్రత్యేక ప్రేమను చూపించి ఉండొచ్చని పైకి కనిపిస్తున్నా..అసలు కారణం మాత్రం మరొకటి ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

దళిత బంధు కేసీఆర్ వాసాలమర్రిలో ప్రారంభించడానికి రీజన్ ఏంటి..? ఎందుకు అంత తొందరగా అమలు చేశారని చెవులు కొరుక్కుంటున్నారు. మొదట హుజురాబాద్ లో ఈనెల 16న దళిత బందును ప్రారంభిస్తామని సిఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఆల్ ఆఫ్ సడెన్ గా వాసాలమర్రిలో దళిత బందును ప్రరంభించేసి అందర్నీ ఆశ్చర్య పరిచారు కేసీఆర్. అయితే కేసీఆర్ ఈ నిర్ణయం వెనక పెద్ద వ్యూహామే ఉందంటున్నారు విశ్లేషకులు. ఆగస్ట్ 15 లోపు హుజురాబాద్ ఉప ఎన్నికకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. ఆగస్టు 15 లోపే నోటిఫికేషన్ వస్తుందని తెలిసే కేసీఆర్…16న హుజూరాబాద్ లో పథకం ప్రారంభిస్తామని ప్రకటించారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు రాజకీయ పండితులు. అంటే 15 లోపు నోటిఫికేషన్ వస్తే దళిత బంధు అమలు సాధ్యం కాదని ఊహించి కేసీఆర్… మొదట తక్కువ మంది దళిత కుటుంబాలు ఉన్న వాసాలమర్రిలో ప్రారంభించారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి

ముందుగా తాను ఈ పథకాన్ని అమలు చేయాలని అనుకున్నా… నోటిఫికేషన్ వచ్చిందని చెప్పే ప్రయత్నంలో భాగంగా ఆగస్టు 16 డేట్ ను ఫిక్స్ చేశారని చెబుతున్నారు విశ్లేషకులు. పైగా నోటిఫికేషన్ కన్నా ముందే వాసాలమర్రిలో దళిత బంధును అమలు చేసి ఈ పథకం కొనసాగుతున్నదని… పైగా ఈ పథకాన్నికి బ్రేక్ పడటానికి ప్రతిపక్షాలు చేసిన కుట్రలో భాగంగానే దళిత బంధు హుజూరాబాద్ లో ఆగిపోయిందని చెప్పే ఆలోచనతో కేసీఆర్ ఉన్నారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముందుగా వాసాలమర్రిలో పథకాన్ని తీసుకొచ్చి.. తాను నిజాయితీగా దళిత బంధును అమలు చేస్తున్నానని మెప్పు పొందేందుకు కేసీఆర్ ట్రై చేస్తున్నారని అంటున్నారు దళిత సంఘాలు.

Load More Related Articles
Load More By admin
Load More In తెలంగాణ

Leave a Reply

Your email address will not be published.